దక్ష యజ్ఞం

While this is not an exact translation of my work, it is a very good one – Satya Sarada.

http://anandamayetimanasukatha.blogspot.com/2011/04/blog-post.html

సూర్యుడు  అస్తమించే  సమయం  కావొస్తోంది ..దక్షుడు  ప్రతిరోజూ  లాగానే  బయటకు వచ్చి  ఆకాశం  వైపు  చూపు  మరలించాడు .. ఇంకొంచం  సేపు  ఆగితే  ఆ  కాస్త వెలుగు  కూడా  పోయి   మరో  కొత్త  లోకం దర్శనమిస్తుంది .. తన లోకం  దర్శనమిస్తుంది .. తూర్పు  దిశగా  మిణుకు  మిణుకు  మంటూ  మెరిసే  ఆ తారల్ని  చూడటం దక్షుడికి  అమిత  ఆనంద  దాయకం! అలా  ఆకాశాన్ని  చూస్తూ,పగలుని  రేయి  కంమేయ్యడం, చీకటిని చీల్చుకుంటూ మళ్లీ  కొత్త  వెలుగు రావడం,వెన్నెల గానం, మెరిసే నక్షత్రాలు.. ప్రపంచంలోని అందాలన్నీ ఆకాశంలో చూసేవాడు అతను!

దక్షుడు అందగాడు, బలశాలి. భార్య ప్రసూతి అంటే వల్లమాలిన ప్రేమ. బ్రహ్మ బొటనవేలు  నుంచి పుట్టినవాడిని లోక ప్రతీతి. దక్షుడు ఆ మాటలను వేళాకోళంగాతీసిపడేసేవాడు. దక్షుడు  ఈ  వ్యవహార  శైలిని  చూసి లోకం ఏమనుకుంటుందో  అని బ్రహ్మకి దిగులు మొదలయ్యింది.

“వారెవరు నాన్న? నా దగ్గర అలాంటి వారికోసం  సమయం లేదు, ఆసక్తి అంతకన్నా లేదు” అనేవాడు అతను!

“బహుశా తమ్ముడు మను అయ్యి ఉంటాడు”, అనుకున్నాడు అతను. “మను, భ్రుగు.. వీరికంటే కచ్చితమైన ఉద్దేశాలు ఉన్నవారిని నేను చూడలేదు. ఎప్పుడు చూసిన నైతికవిలువలు, సామాజిక  వ్యవహారాలూ, నియమాలు! అందరికంటే వారే మెరుగైన వారు అనే నమ్మకం! నిజం చెప్పాలి అంటే భ్రుగు చేతిలో మాయ ఉంది.. ఎలాంటి వ్యాధిని ఐనఅతను నయం చెయ్యగలడు.. దేనికి బయపడడు! మను, సామాజిక  వ్యవహారాలలో దిట్ట! కానీ కొన్ని సార్లు మనుష్యులని  మనుష్యులుగా  చూడలేడు !”  అన్నాడు తన భార్యతో .

“ మా నాన్నని  అనే ముందు కొంచం జాగ్రత్త! మీరేమి అంత గొప్పవారు కాదు!” అనింది ప్రసూతి

“నా  బంగారు తల్లి సతిని  ఇటు  తీసుకుని  రా .. నేను  తనకి  ఒకటి  చూపించాలి ”,అన్నాడు  దక్షుడు  తన  భార్యతో . సతి  సాక్షాత్తు  దేవి  స్వరూపమని  దక్షుడు నమ్మేవాడు .  అందం , ఆలోచన , సౌమ్యత , ధైర్యం  అన్ని  కలబోసుకుని  పుట్టిన పుత్తడి  బొమ్మ సతి.

“నాన్న, నేనిక్కడ! నాకు మళ్లీ నక్షత్రాలను చూపిస్తున్నారా?” అడిగింది సతి ఆనందంతో!

తూరుపు  పడమరల  మధ్య  సూర్య  చంద్రులతో , కోట్లాది  తారలతో  మనం రోజు సాగించే సహజీవనాన్ని తన కూతురికి చూపించాలనుకున్నాడు దక్షుడు. “అదిగో తూర్పు, అక్కడి నుంచే  మొదలవుతుంది వారి ప్రయాణం.. అటుగా బయలుదేరి, అలసి సొలసి  పడమర వైపుగా  వారు  వెళ్ళిపోతారు. మీ తాతగారు అయిన  బ్రహ్మ  నాకుసూర్యచంద్రులు ఉదయించడం, చంద్రుడు సగం రోజులు  ఉత్తరంగా  మిగితా సగం రోజులు దక్షిణంగా వెళ్ళడం చూపించారు“ అమిత ఉత్సాహంతో చెప్పాడు దక్షుడు

“నాకు ముందే తెలుసుగా.. అదిగో ఆ దిక్కున కనిపించే చుక్కే శ్రవిష్ట .. తాతగారికినచ్చిన నక్షత్రం” అంటూ దక్షిణంగా చూపించింది సతి. తన చిన్నారి జ్ఞానానికి విస్తుపోయాడు దక్షుడు. “తల్లి నాకు నీ సహాయం కావాలి. ఎన్నో సంవత్సరాలుగా నేను చెయ్యతలచిన  కార్యానికి నీ  తోడు  కావాలి” అన్నాడు దక్షుడు .

“ముందుగా, నెల రోజుల  పాటు  మనం  చందమామని  పరిశీలిద్దాం. ఆయన వెళ్ళే దారిని  చూద్దాం. ఆ దారిలో  ఆయన  కలిసే  నక్షత్రాలని  చూద్దాం. ఒక్కో  నక్షత్రం  దగ్గర ఆయన  ఎంతసేపు  ఉంటాడో  చూద్దాం . వాటికి  అంకెలిద్దాం ” అన్నాడు దక్షుడు

“లేదు  నాన్న. అవి  అందంగా  ఉండే  నక్షత్రాలు .మన  స్నేహితులు . వాటికి  మనం పేర్లే  పెడదాం ” అనింది  సతి. సరే అన్నాడు దక్షుడు.

ముందుగా వెదురు దుబ్బలతో  చిన్ని  చిన్ని  వృత్తాలను  చేసి , మట్టితో  నక్షత్రాలను గుర్తించాలని  అనుకున్నారు  ఇద్దరు. “నక్షత్రాలకు  పేర్లు  పెడితే , వాటిని  నా కూతురలని చేస్తారు  వారు (మను  భ్రుగు ) “ అన్నాడు  దక్షుడు  నిట్టురుస్తూ!

“కాని  మనం  వారిని  పట్టించుకోము  కదా , కాదా ? నాన్న ” అడిగింది  సతి

“పట్టించుకోము ” అన్నాడు  దక్షుడు !

అలా  వారు  మొదలుపెట్టిన  కార్యం  చాలా  నెలలు  సాగింది . రోజులు  గడిచే కొద్దివారు  చేసిన  నమూనాకి  మెరుగులు దిద్దడం  మొదలుపెట్టారు . ఆకాశంలోప్రాకాశవంతగా  ఉన్న  నక్షత్రాలకి  పేర్లు  పెట్టసాగారు  . అన్ని దిక్కులా  నుంచి  సరి సమానంగా  ఉండే  నక్షత్రాలని  పరిగణంలోకి  తీసుకోసాగారు. ఇందువలన కొన్ని నక్షత్రాలు దగ్గరగా .. కొన్ని దూరంగా  అయ్యాయి . కొన్ని  రాత్రులు , వీరికి  భ్రుగు జత కలిసేవాడు . అలా వచ్చిన  భ్రుగుకి , సతి  ఏంటో  ఆనందంగా  ఆకాశాన్ని  సరికొత్తగా పరిచయం చేసేది . నక్షత్రాలని  కలుపుతూ  అందమైన  ఆక్రుతులని  చూపించేది. “అదిగో  అక్కడ  మీకు  మేషం కనిపిస్తోందా ? అక్కడ  కనిపించే  ఆ నక్షత్రమే  అశ్విని ”అనింది  సతి . “ఆ  కనిపించే  వ్రుషభమే  నా  శివుడి  వాహనం . ఆ  నక్షత్రాన్ని  మేము ఆరుద్ర  అన్నాము .. రౌద్రాన్ని  చూపిస్తోందని (ఎర్రగా  ఉందని )”ఆ  మాటలు  విన్న భ్రుగు  దక్షుడికేసి  చూడసాగాడు . “ నా  శివ ?” ప్రశ్నార్థకంగా  చూసాడు . “సతి ఇంకా చిన్న  పిల్ల ” అన్నాడు  దక్షుడు

“ 8 సంవత్సరాలు  దాటితే  ఆడపిల్లకి  యుక్త  వయసు  వచ్చినట్టని  మను  చెప్పాడు ”అన్నాడు  భ్రుగు

“కొత్తగా  కలిపించి  చెప్పకు .. మను  ఇలాంటివి  చెప్పడు ” అన్నాడు  దక్షుడు

ప్రసూతి  వారి  మాటల  మధ్యన  కల్పించుకుని  ఇలా  అనింది  “ఎవరు  ఏమి  అన్నా ,సతి  ఆడపిల్ల . మీరు  తనని  ఆడపిల్లలా  పెంచడం  లేదు . ఇలా  అర్థరాత్రుల  వరకూ బయట  ఉండి   .. నక్షత్రాలను  చూడటం , వాటికి  పేర్లు  పెట్టడం . తనకి  అలంకరణ మీద  కాని , ఇంటి  విషయాల  మీద  కాని  ఏ  మాత్రం  ధ్యాసలేదు . ఇలా  ఎన్ని రోజులు  ఉండాలని  మీరు  అనుకుంటున్నారు ?”

“సతి సాక్షాత్తు  దేవి  స్వరూపం.  తను  నా  పక్కన  ఉంటే , ఈ  జగత్తు ప్రకాశవంతమవుతుంది  , అలానే  నా  మనసు  కూడా . నేను  ప్రశాంతంగా ఆలోచించగలను  . ఏదైనా  అర్థం  చేసుకోగలను . నక్షత్రాలు  ఉన్నా  లేకపోయినా ,సతి  సామాన్యమైన  బాలిక  కాదు ” అన్నాడు  దక్షుడు

భ్రుగు  వెళ్ళిన  తర్వాత  ప్రసూతి  తన  భర్తతో  “నక్షత్రాల  గురించి  మాట్లాడని సమయంలో  తను  మాట్లాడేది  కేవలం  శివుడి  గురించి ! ఆతడినే పెళ్ళాడాలని  సతి నిశ్చయించుకుంది ” అని  చెప్పింది

ప్రసూతి  మాటలు  విన్న  దక్షుడు  ఆలోచనలో  పడ్డాడు . జాతి  కుల  బేధాలు  తనకి లేకపోయినా , పుట్టు  పూర్వోత్తరాలు  తెలియని  వాడిని  తన  కూతురు వివాహమాడాలని అనుకున్టునదన్న విషయం  అంత ఇంపుగా  అనిపించలేదు దక్షుడికి . మను  భ్రుగుల  తలపు  వచ్చింది . “ఆహ , ఎంతటి  తల  నొప్పి ” అనుకో సాగాడు . వారిద్దరూ  దీనికి  అస్సలు  ఒప్పుకోరు . బ్రహ్మ  వారసులంతా  ఒకటే జాతిగా  ఉండాలని … వారి  జాతి  వారినే  వివాహమాడాలన్నది వారి  ఉద్దేశం . వారితో మాట్లాడి  ఏమి  ఉపయోగం  లేదనుకున్నాడు  దక్షుడు

వెంటనే వశిష్టుడిని సంప్రదించాలని  అనుకున్నాడు . “ మీరు  మా  తండ్రి  తలనుంచి వచ్చారని  అంటారు అందరూ.” అన్నాడు  దక్షుడు .

వశిష్టుడు  చిన్నగా  నవ్వి  “ వారు  మాట్లాడే  వాటిని  జాగ్రత్తగా  అర్థం  చేసుకోవాలి .ఉన్నది  ఉన్నట్టుగా  తీసుకోకూడదు . బ్రహ్మ  తల  నుంచి  పుట్టిన  వాడు  అంటే బ్రహ్మ  ఆలోచనలని , తలపులని  అర్థం  చేసుకున్న  వాడినని  వారి  ఉద్దేశం .”

“నేను  సందిగ్ధంలో  ఉన్నాను . నా  కూతురు  సతి  శివుడిని  తన  మనసులో పెట్టుకుంది . అతగాడికి  మూడు  కళ్ళని , స్మశానంలో  జీవనం  సాగిస్తాడని ,పాములతో  సహజీవనం  చేస్తాడని  విన్నాను . అతను బ్రాహ్మణుడు  కూడా  కాదే. ఈ వ్యవహారం  మనుకి  నచ్చకపోవచ్చు ” అన్నాడు  దక్షుడు

దానికి వశిష్టుడు  “ ఇది  మను  జీవితం  కాదు . సతి  ఇష్టం . నీకు  తెలిసినదే  కదా ..నేను  అరుంధతిని  వివాహమాడ  తలచాను . ఆవిడ  కూడా  బ్రాహ్మణ యువతి  కాదు . మనుకి  సామాజిక  శాస్త్రం  తెలుసు . సామాజిక  నిమయాలని  గురించి  అతను బాగా  అర్థం  చేసుకోగలడు. కాని  అతనికి  మానసిక  శాస్త్రం  గురించి  ఏమి తెలియదు . మనుష్యుల  ఆలోచిన, వారి  పధ్ధతి  అతను  అర్థం  చేసుకోలేడు  . జీవిత పరమార్థం స్వచ్చమైన  జాతిని  ముందుకు   తీసుకెళ్లడం  కాదు , ఆ  పరమాత్మని  అర్థం చేసుకోవడం , పరమాత్మలో  ఏకమవ్వడం” అని  చెప్పాడు

కొంచం  సేపు  ఆగి , మళ్లీ  చెప్పసాగాడు  “ నీ  గారాల  కూతురు  నాకు  మీరు  చేపట్టిన కార్యం  గురించి  చెప్పింది . మనుష్యులు  వారి  జీవితంలో  జరిగే  గట్టాలని  నక్షత్రాలతో అనుసంధానం  చేస్తే , జీవితం  ఇంకా  సులువుగా  అవ్తుందేమో , నక్షత్రాలను  విషయ సూచికలుగా  పెట్టి , మంచి  చెడులను  చెప్పవచ్చని   నా  ఉద్దేశం ”

దక్షుడు  ఆక్రోపించి  “ మీరు  కూడా  మొదలు  పెడుతున్నారా? నా  తమ్ముడు  భ్రుగు వీటన్నిటిని  కలిపి  ‘జతక చక్రాలు ” వెయ్యడం  మొదలుపెట్టాడు . నక్షత్రాల  స్థానాన్ని చూసి  ఎవరి  జీవితంలో  ఏమి జరుగుతుందో  చెప్తున్నాడు . అందరి  గురించిన సమాచారం  కనుక్కుని  వారి  రేపటి  గురించి  చెప్పసాగాడు . ముందు  తరాలవారి గురించి  కూడా  చెప్తున్నాడు . తన  కూతురు  శ్రీదేవి  ఈ  విషయంలో  తనకి తోడ్పడుతోందని  చెప్పాడు ”

మరుసటి  రోజు  ఉదయం  వారింట్లో  ఈ  విషయం  మీద  వాదన  మొదలయ్యింది . వ్యక్తిత్వ  స్వాతంత్ర్యం ,స్వేచ్చ  ముఖ్యమా  లేక  జాతి  మత కులాలు  ముఖ్యమా  అనే విషయం  మీద  వాదన  మొదలయ్యింది . ఏ  ఒక్కరి  వాదన  ఇంకొకరు  వినేలాలేరు .భ్రుగు  ఏదో  చెప్పడం  మొదలుపెడితే , “జాతకాలని  నమ్మేవాడివి  నువ్వు .. నీకే హక్కు  ఉంది  స్వేచ్చ  స్వతంత్రాల  గురించి  మాట్లాడటానికి ” అని  అందరూ  అతనిని ఆపేసారు .

అప్పడు  ప్రసూతి  “జాతి  స్వచ్చత  కావాలంటే  ఆడవారిని  మగవారిని  అదుపులో పెట్టగలగాలి . తన  కూతురుకి  ఎలాంటి  భర్తని  తీసుకురావాలో  ఒక  తండ్రి  హక్కు అయితే , ఆ  హక్కు  వల్ల కూతురు  తనకు   నచ్చిన  వాడిని  చేసుకోలేకపోతుంది . ఇది  స్వేచ్చా  భావానికి  విరుద్ధం  కాదా ? “ అనింది

దానికి  మను  “న  స్త్రీ  స్వతంత్రం  అర్హతి  – ఆడదానికి  స్వేచ్చా  అనేది  లేదు ” అని అన్నాడు

ప్రసూతికి  ఆ  మాటలు  అంతగా  నచ్చలేదు . కాని  తండ్రితో  వాదన  ఇష్టం  లేక  తను ఆగిపాయింది .

అప్పుడు  సతి  నవ్వుతు “యా  స్త్రీ  స్వతంత్రం  చాహతి, సా స్త్రీ  స్వతంత్రం  అర్హతి ! ఎవరైతే  స్వేచ్చని  కోరుకుంటారో , వారు  స్వేచ్చా  భావానికి  అర్హులు ” మను ఒక్కసారిగా  సతి  వైపు  చూడసాగాడు . సతి  మాట్లాడటం  మొదలుపెట్టాక అది సామాన్య  వాదన  లాగా కనిపించలేదు . దైవ  ఆజ్ఞాలా అనిపించింది . సతి  దేవి స్వరూపం  కదా !

అప్పుడు  దక్షుడు  ఇలా  అన్నాడు  “ తండ్రి , ఇంకొంచం  సేపట్లో  సూర్యాస్తమయం అవ్తుంది . నేను  సతి  మేము  తలపెట్టిన  కార్యం  చెయ్యాలి . ప్రసూతి  మమల్ని  ఖాళి కడుపునా  ఏమి  చెయ్యనివ్వదు .. మీరు  ఆజ్ఞ  ఇస్తే  ఈ  విషయం  మరొక  మారు చర్చిద్దాం ”. ఆ  రోజు  వశిష్టుడు , శ్రీదేవి  కూడా  వారితో  పాటు  వెళ్లారు .

భ్రుగు  మను  మాత్రం  బ్రహ్మ  దగ్గర  ఉండిపోయారు . అప్పుడు  బ్రహ్మ  మనుతో  ఇలా అన్నాడు  “నువ్వు  ఇలానే  ఉంటే, అందరూ  నిన్ను  పెంకి  వాడిగా  పరిగణిస్తారు. వేరే వారి  ఆలోచనలని  పరిగణలోకి  తీసుకో ”

అప్పుడు  మను  “ తండ్రి , ఇదంతా  జరగడానికి  వారంతా  నా  మాట పూర్తిగా వినకపోవటం  కారణం . దక్షుడు  సామాజిక  శాస్త్రాని  అసలు  పరిగణలోకి  తీసుకోడు . నేను  జాతి  స్వచ్చత  గురించి  వారు  అనుకునే  ఉద్దేశంలో  మాట్లాడటంలేదు . వెర్రి వాళ్ళు  మాత్రమే  వీరి  మాటలు  నమ్ముతారు ” అన్నాడు

మరలా “నేను  మాట్లాడుతున్నది  జాతి  వివక్ష  గురించి  కాదు . ప్రతి వంశానికి  ఒక వ్రుత్తి  ఉంటుంది . మీ  నుంచి  దక్షుడు  పితామహ  సిద్ధాంతం  నేర్చుకున్నాడు . అది తన  కుమార్తె  ఐన  సతికి  నేర్పిస్తున్నాడు . అతని  వల్ల  వశిష్టుడు భ్రుగు  కూడా  వారి విద్యలని  మెరుగు  పరచుకుంటున్నారు . ఇది  ఒక  వ్యవస్థ , పెద్దల  నుంచి తర్వాత తరాల  వారికి  వారి  జ్ఞానాన్ని   పంచడం . విశ్వకర్మనే  చూడండి . అతను  శిల్ప కళలో దిట్ట . అతను  విష్ణు  మూర్తి  కోసం చెక్కిన  విల్లు  చూస్తే కాని  నమ్మనిదిగా ఉంటుందట . అలా  మనం  ప్రతి  ఒక్క  వంశానికి  వారి  వారి  వృత్తులని  కేటాయిస్తే మన  దేశం ఎంతో  అభివృద్ధి చెందుతుందని  నా ఉద్దేశం . పారంపర్యంగా కళలు ముందు  తరాలకి  వెళ్తుంది ”

దానికి సమాధానంగా   బ్రహ్మ  ఇలా  అన్నాడు  “ నువ్వు  చెప్పినది  అర్థం  అయింది .చెప్పడం  మరిచాను . నువ్వు  కాల  గణనం  మీద  చేసిన  పరిశోధన  గురించి విన్నాను . అద్భుతం ! నీ  నైతిక  విలువలు  కాని , నీ  సిద్ధాంతాలు  కాని  అద్భుతం . కాని  నువ్వు  విధించే  ఆంక్షలు  కొన్ని  సందర్భాలలో  మనిషి  స్వేచ్చని  దూరం చేసేవిగా  ఉన్నాయి . ఆనందం  అనేది  కృత  నిశ్చయంలో  ఉంటుంది . మనిషి స్వేచ్చా  జీవి .. అతనికి  ఎంపిక  చేసుకునే  అవకాశం కావాలి !”

“నేను  మనిషి  ఆలోచన  సరళి  గురించి  మాట్లాడ  తలచుకోలేదు . వశిష్టుడు  ప్రతి క్షణం  దాని  గురించే  మాట్లాడుతూ  ఉంటాడు . కాని  మనిషి  నియమాలు పాటించడంలోనే , సమాజ  శ్రేయస్సు  ఉంది . సమాజ  శ్రేయస్సులోనే  దేశ  శ్రేయస్సు ఉంది ” అన్నాడు  మను .

మను  మాటలు విన్న భ్రుగు  అతని  వైపు  ఆరాధనా  భావంతో  చూస్తూ  ఇలా అన్నాడు “ నా  పిల్లలకు  వారి  పిల్లలకు  నువ్వు  చెప్పిన  ప్రతి  మాట  చేరేలా  నేను చూస్తాను .సమాజ  శ్రేయస్సు  కోసం  నేను  వారిలో  త్యాగ  స్వభావాన్ని  పెంచుతాను ”

అటు  దక్షుడి  ఇంట్లో , సతి  ఎంతో  ఆనందంగా  అందరికి  వారు  చేసిన  పని  గురించి చెప్పడం  మొదలుపెట్టింది . శ్రీదేవికి  ధ్రువ  తారని  చూపించి , ఆ  నక్షత్రం  ఎప్పుడూ కదలదని , ప్రతి  రోజు  అక్కడే  ఉంటుందని , అందుకే  దానికి  ధ్రువ (స్థిరంగా  కలది ) అని  పేరు  పెట్టామని   చెప్పింది  సతి . అలాంటి  స్థితిని  ఎవరైనా  సాధించగలరని , శ్రద్ధ పట్టుదలతో  ఉన్నత  స్థానాలని  సాధించ  వచ్చని  వశిష్టుడు  తనకు  చెప్పిన మాటలను  గుర్తు  చేసుకుంది .

అలా  రాత్రి  గడిచే  కొద్ది  ఒక్కో  నక్షత్రం  ఉదయిస్తూ , వాటి  ప్రయాణం  సాగిస్తుండగా ..సతి  అందరికి  వాటి  పేర్లు  చెప్తూ  ఎంతో  ఉత్సాహంతో  ఉంది . ఒకరోజు  తను ఆకాశంలో  ఒక  పంచభుజిని  చూపించి , “ ఈ  అయిదు  నక్షత్రాలని  మా  తాత అయిన  బ్రహ్మ  పేరు  మీద పెట్టాము ” అని  చెప్పింది . వశిష్టుడిని  పిలిచి , “మీరు ఆ ఏడు నక్షత్రాలను  చూడగలరా ? అందులో ఉన్న  రెండో  నక్షత్రం  మీ  పేరు  మీద పెట్టాము . దాని  పక్కనే  ఉన్న  నక్షత్రానికి  అరుంధతి  పేరు  పెట్టాము ” అని  చెప్పింది .

అర్థరాత్రి  అయ్యే   సమయానికి  సతి , శ్రీదేవి  తిరుగు  ముఖం  పట్టారు . “ మా  నాన్న నా  వివాహం  విష్ణు  మూర్తితో  చెయ్యబోతున్నారు , మరి  నీ  సంగతి  ఎంత  వరకూ వచ్చింది ” అని  అడిగింది  శ్రీదేవి .

దానికి  సతి  “ అందులో  ఏముంది , రేపటి  నుంచి  నేను  నిరాహార  దీక్ష  మొదలు పెడతాను . నా  ప్రేమ  పట్టుదల  ముందు  అందరూ  తల  వంచాల్సిందే . శివుడిని నాకు  ఇచ్చి  కట్టబెట్టాల్సిందే” అని  చెప్పింది  కచ్చితంగా !

సతి  తను  చెప్పినది  చెప్పినట్టుగానే  చేసింది . దక్షుడికి  మరో  దారిలేక  శివుడిని కలవడానికి  నంది  దగ్గరకి  వెళ్ళవలసి  వచ్చింది . తనని  కలవడానికి  వచ్చిన శివుడిని  చూసి  దక్షుడు  ఆశ్చర్యానికి  గురి  అయ్యాడు . అతగాడి  అందం , ముఖ వర్చస్సు  చూసి  దక్షుడు ముగ్దుదయిపోయాడు . “ ఇతగాడి  అందం  చూసాక , పుట్టు పూర్వోత్తరాల  గురించి  ఇంకా  నేను  ఆలోచించాను ” అని  అనుకున్నాడు  తనలో తను .

“అందరూ  మాట్లాడే  నీ  మూడో  కన్ను  ఏది ? కనిపించదేమి ? నిజంగానే  అందులో నుంచి  అగ్ని  ప్రజ్వలిస్తుందా?” నిర్మొహమాటంగా  శివుడిని  అడిగాడు  దక్షుడు

దక్షుడి  ప్రశ్నకు  శివుడు  మనస్పూర్తిగా  నవ్వసాగాడు . అతని నవ్వు  నలుదిక్కులా వ్యాపించి  కొండల్లో  కోనల్లో  వినిపించ  సాగింది . అన్ని  వైపులా  కాంతులీని , గాలిలో సుగంధాల  పరిమళాలు  వ్యాపించసాగాయి . దక్షుడు  తన  చూపు  తిప్పలేకపోయాడు . మరుక్షణం  అతనికి  శివుడే  సతికి  తగిన  వాడని  అర్థమయ్యింది ! ఇతను సామాన్యమైన  వ్యక్తి  కాదని , అతగాడి  పుట్టు  పూర్వోత్తరాలు  అడగటం  హేయమైన విషయమని  దక్షుడు  అనుకున్నాడు .

అప్పుడు  శివుడు  “ మూడో  కన్నుగా  అందరూ  వ్యవహరించేది  మరేదో  కాదు . అది నా  జ్ఞాననేత్రం . నేను  యోగ  శాస్త్రంలో  పండితుడను . నాకు  లౌకిక  విషయాలతో సంబంధం  లేదు . అందువలన   నేను  ప్రశాంత  మనస్సుతో  ఆలోచించగలను .నిజాన్ని  నిర్మొహమాటంగా  అంగీకరించగలను .కానీ  అందరి  విషయంలో  అది సాధ్యపడదు .” అని  చెప్పాడు

“దయచేసి  నా  కుమార్తెను  వివాహమాడండి  ” ఆతురతగా  అడిగాడు  దక్షుడు .”మొండిగా  నా కూతురు  మీకోసం  నిరాహార  దీక్ష  చేపట్టింది . మిమ్మల్ని  కాకుండా వేరేవారిని  వివాహమాడనని  బీష్మిన్చుకుని  కూర్చుంది . తన  పట్టుదల  ముందు నేను  తలవంచక  తప్పలేదు . కానీ  ఇప్పుడు  మిమ్మలను  చూసాక , తను తీసుకున్న  నిర్ణయం  సరి  అయినదని  అర్థమైంది ” అని  చెప్పాడు

“నేను  మీతో  వెంటనే వస్తాను ” అన్నాడు  శివుడు .

దక్షుడి  ఇంట్లో , సతి , దక్షుడు  కలిసి  చేసిన  నమూనా  చూసాడు  శివుడు . వారు చెప్పటిన  కార్యం  వెంటనే  అర్థమైంది  అతనికి .

సతి  బయటకు  వచ్చి , దీనిని  ‘దక్ష యజ్ఞం ’ అని  అందరూ  అంటున్నారని  చెప్పింది . “కష్టతరమైన  కార్యాన్ని  యజ్ఞం అనడం  మా ఇంట్లో  ఆనవాయితి . ఈ  యజ్ఞాన్ని మేము గత కొన్ని నెలలుగా చేస్తున్నాం .” అని చెప్పింది . సతి వైపు చూసి శివుడు “నీ  గురించి  మీ తండ్రి చెప్పినది నిజమే అనిపిస్తోంది. నీ పట్టుదల ముందు ఎవరు నిలువలేరు. నువ్వు అందరు ఆడపిల్లల్లా కాదు అని అర్థం అవుతోంది” అన్నాడు నవ్వుతూ.

దానికి సతి  నవ్వుతూ  “ అందరూ  రూపాన్ని చూస్తారు, కానీ  విషయాన్ని  చూడరు .నేను  రెండూ  చూస్తాను . నన్ను  మీ  అర్ధాంగినిగా  స్వీకరిస్తారా?” అని  అడిగింది .

దానికి  శివుడు  నవ్వుతూ “నిన్ను వివాహమాడాలనుకున్తున్నానని  మీ తండ్రిని అడిగే అదృష్టాన్ని నాకు  ఇవ్వవా? తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీలాంటియువతిని  నే  ఇప్పటి  వరకు  కలవలేదు . నాతో  పాటు  స్మశానంలో  బ్రతకడానికి ,బూడిదతో  కప్పబడటానికి , సమయమంతా  యోగ  ధ్యానంలో  ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు  ఇప్పటివరకు ”

శివుడి  దర్శనాన్ని  విన్న  వశిష్టుడు వెంటనే  దక్షుడి  గృహానికి  వెళ్ళాడు .పాదాభివందనం చేసి , ఆశీర్వచనాలు  అందుకున్నాడు . “ మా  తమ్ముడి  కుమార్తెను మీరు  భార్యగా  స్వీకరించారని  విన్నాను . మేము  ధన్యులము   అయ్యాము ” అని అన్నాడు  వశిష్టుడు . అది  విన్న  దక్షుడు  ఆశ్చర్యచకితుడయ్యాడు . ఇది గమనించని  వశిష్టుడు  “ నేను  యోగ  వసిష్టం  రాయబోతున్నాను . వేద మంత్రాలను  కూడా  సమకూర్చుతున్నాను. వాటిలో  సూర్యుని  మరియు  సముద్ర విశిష్టతలు  చెప్పడంతో  పాటు  దక్షుడు  ఆకాశం  మీద  చేసిన  కొన్ని  పరిసోధనలని కూడా  పొందుపరచతలచాను . మంగళ  ప్రదమయిన  దివ్య  ముహుర్తాలు  పెట్టడానికి వీలుగా  నేను  ఒక  వ్యవస్థని  తాయారు  చెయ్యబోతున్నాను . శుభముహుర్తలలో  ఏ పని   మొదలుపెట్టినా నిర్విఘ్నంగా  సాగుతాయి . నేను  అగ్ని  దేవుడితో  మాట్లాడి గతంలో  అలాంటి  మంగళ  ముహూర్తాల  గురించి  కనుక్కున్నాను  . ఇక  నాకు   మిగిలినదల్లా మీ  దర్శన భాగ్యం  ఒక్కటే . అది  కూడా  ఈ రోజుతో  తీరిపోయింది  . మీ దర్శన భాగ్యం  వల్ల నాలో  ఉన్న  అనిశ్చితి  పోయి  నా  దారి  సుగమం  అయింది . మీ దగ్గర  అన్నిటికి  జవాబు  ఉంటుంది .. మీరే  అన్నిటికి  జవాబు . నా  వంశం  ఎప్పటికి ధన్యం  అయినది స్వామి ”

ఆశ్చర్య  చకితుడైన  దక్షుడు  ఇలా  అనుకున్నాడు  “ మనకంటే  చిన్నవారికి  వందనం చెయ్యవచ్చా ? లేదా  కూతురిని ఇస్త్తున్న వారికి  నమస్కారం  చెయ్యవచ్చా ?” కొంచం సేపటికి  స్పృహలోకి  వచ్చి  తాను  కూడా  మనులా  ఆలోచిస్తున్నానని , వశిష్టుడు చేసినది  సరి  అయినదే  అయ్యి  ఉంటుందనుకున్నాడు  దక్షుడు .

“ఓ సతి , నీకు  వివాహం  జరిగి  నువ్వెళ్ళిపోతే  మనం  తల  పెట్టిన  యజ్ఞం ఏమవుతుంది ?” అన్నాడు  దుఖితుడైన  దక్షుడు ! “మను  చెప్పినది  నిజమే .ఆడపిల్లని  చదివించి  ఉపయోగం  లేదు . వివాహానతరం  వారు  వదిలి  వెళ్ళిపోతారు . కేవలం  కొడుకులు  మాత్రమే  ఉంటారు ” అన్నాడు . దానికి  సతి  నవ్వి  “ఆడపిల్ల ఇల్లు  వదిలి  వెళ్ళాలి  అన్నది  కూడా  మగవారు  విధించిన  నియమమే  అయ్యి ఉంటుంది  కదా . బాధపడకు  నాన్న . వశిష్టుడు  మరియు  భ్రుగు  మహర్షి  ఉత్తర ఫాల్గుణి  నక్షత్రం  వచ్చేవరకు  ఆగమని  చెప్పారు . అప్పటి  వరకు  శివుడు  కూడా మన  యజ్ఞం  పూర్తీ  చెయ్యడంలో  మనకి  తోడ్పడతారు ” అని  చెప్పింది

దక్షుడు  నవ్వి  “ వసిశుతుడు  నక్షత్రాల  ఆధారంగా  మన  జీవితాలని  మలచుకోవాలి అంటాడు. భ్రుగు  మన  జీవితాలు వాటి  ఆధారంగా  ముందు  నుంచే  మలచబడ్డాయి అంటాడు . వారి  ఉద్దేశాలు  విరుద్ధమైన  కాని  వీరిద్దరూ  కలిసి  చేస్తారు  ఏ  కార్యమైనా” అనుకున్నాడు .

శివుడుని  దేవుని  వరంగా  భావించ  సాగాడు  దక్షుడు . చెప్పాల్సిన  అవసరం లేకుండా  అతను  అన్ని  పసిగట్టే  వాడు . వారి  నమూనాను  ఆధునికరించడంలో ఎంతో  సహాయం  చేసాడు .గురుత్వాకర్షణ  శక్తీ  గురించి  మాట్లాడేవాడు . విశ్వకర్మ సహాయంతో  పూర్తిగా  బంగారంతో  వారి  నమూనా  తాయారు  చేపించమని  సలహా ఇచ్చాడు .

ఈ  రోజుకీ  వారు  తలపెట్టిన  కార్యాన్ని అందరూ  దక్షయజ్ఞామనే అంటారు . కాని  ఆ యజ్ఞంలో  శివుడు  చేసిన  సహాయానికి  ప్రతిఫలం  ఏమి  రాలేదని  గ్రహించి  ఆ విషయం  వాళ్ళ  నాన్నతో  మాట్లాడాలని  నిర్ణయం  తీసుకుంది . కాని  దక్షుడికి మాత్రం  అలా ఇవ్వడం  ఇష్టం  లేకపోయింది  . కాని  సతికి  తన  నాన్న  వ్యవహారం నచ్చలేదు , మొత్తానికి  శివుడు  తనని  ఒప్పించాల్సి  వచ్చింది . కోపంలో  ఉన్న సతితో  శివుడు  ఇలా  అన్నాడు  “ మీ  నాన్న  మహా  జ్ఞ్యాని. అతను  వేసిన  లెక్కలు సామాన్యమైనవి  కాదు .నేను  ఆయనకీ  నమూనా  వెయ్యడంలో  కాస్త  సాయం చేశాను  అంతే . ఆయన  ప్రతి  నక్షత్రాన్ని  నాలుగు  పాదాలుగా  విభజించాడు . ప్రతి పాదానికి  ఒక  వృత్తాని  వేసాడు . ఆయన  నమూనాలో  ఏ  నక్షత్రం  ఎప్పుడు ఉదయిస్తుందో  ఎప్పుడు  అస్తమిస్తుందో  సులువుగా  చెప్పవచు .దీనివల్ల  పగటి  పూట నక్షత్రాలు  ఎలా  కదులుతాయి  అన్నది  కూడా  చెప్పవచు ” అని  అన్నాడు

దానికి సతి  “సూర్య  చంద్రుల  స్థానాలు  తెలిసేలా  ఆ  నమూనాని  మార్చితే  ఇంకా బావుంటుందని  నా  ఉద్దేశం . ఇంతకీ  వివాహానంతరం  మనం  హిమాలయ పర్వతాలకు  వెళ్ళిపోతాం  అన్న  విషయం  ఆయనకి  మీరు  చెప్పారా? మా తాతగారిఉద్దేశంలో మనం కొండల మీద, సముద్రాల మీదా ఎక్కువ ఆధారపడుతున్నమంతా .కొందరు  భటులను  రక్షణ  కోసం  పెట్టుకోవడం  మంచిదని  ఆయన  ఉద్దేశం ” అని చెప్పింది

“మే  అమ్మగారికి  చెప్పే  ధైర్యం  ఎవరికీ  లేదు . అది  నీ  బాధ్యత ” అన్నాడు  శివుడు

“హిమవంతుడు  మేనక  చాలా ఆనందంగా  ఉన్నారు . నీ రాక  కోసం  ఎదురు చూస్తున్నారు . వారు  నిన్ను  వారి  సొంత  కుమార్తేలా భావిస్తున్నారు . అందరూ వారి  పార్వతి  దేవి  కోసం  ఎదురు  చూస్తున్నారు . నువ్వు  దేవి  స్వరూపమని అందరి  నమ్మకం ” అన్నాడు  శివుడు

దక్షుడు  మరియు  శివుడు  చివరి  హంగులు  దిద్దారు  వారు  చేసిన  నమూనాకి . ఎక్కడి  నుంచి  మొదలు  పెట్టాలి  అన్న  విషయంలో , దక్షుడు  అభిజిత్ (దక్ష )నక్షత్రాన్ని  ఎంచుకుంటే , శివుడు  అశ్వని  నక్షతాన్ని  ఎన్నుకున్నాడు . అశ్విని నక్షత్రంతో  మొదలుపెడదాం , మేషంలో  మొదటి  నక్షత్రం , మీ  మేక  తల  అని అన్నాడు  శివుడు . దక్షుడికి  విపరీతమైన  కోపం  వచ్చింది . “ నా అల్లుడే  నా  తలని మేక  తలతో  మార్స్తాడ ?”అన్నాడు .

“తప్పేముంది ?” అన్నాడు  శివుడు

“అలా చెయ్యడం  అర్థవంతంగా  ఉంది . ౨౮వ  దక్ష  నక్షత్రాన్ని  తీసేసి , ముందుగా అనుకున్న  27 నక్షత్రాలనే  ఉంచుదాం ” అన్నాడు  శివుడు

“శివుడు  అందరు  ఏమనుకుంటారు  అని  ఆలోచించడు . నా  తల  ఒక  మేక  తలతో మార్చబడింది  అని  అందరు  నవ్వుతారు . పొగరుబోతుతనం  వల్ల  నాకు  ఇలా జరిగిందని  ప్రచారం  చేస్తారు ” అని  బాదపడ్డాడు  దక్షుడు

“కాని  ఎవరు  నువ్వు  చేసిన  గొప్ప  పనిని  మర్చిపోరు ” అన్నాడు  వశిష్టుడు . “ఇక మీదట, మేషాన్నే  కాదు  వేరే  ఏ  నక్షత్రాన్ని  చూసిన  నిన్ను  తలచుకొని  వారు ఉండరు ” అని  అన్నాడు !

Notes:

1.     మనుస్మ్రితి ని  రచించింది  మను . వ్యాఖ్యానించింది  భ్రుగు

2.     భ్రుగు  సంహితాన్ని  రచించింది  భ్రుగు . వైద్య  శాస్త్రం ,జ్యోతిష్య  శాస్త్రాన్ని ఇందులో  పొందు   పరిచారు

3.     ప్రఖ్యాత  యజ్ఞ  నాశనం  దక్ష్య యజ్ఞ  నాశనమే ! దానిని  నాశనం  చేసిన  వారు మరెవరో  కాదు  సాక్షాత్తు  శివుడే

4.     శివుడు  దేవతలకు , అసురులకు  దేవుడే ! అందుకే  ఆయన  దేవదేవుడు !

5.     సంస్కృతంలో  దక్ష అనగా  దక్షిణం  లేదా  నేర్పరి  అని  కూడా  అర్థం

Authorship and Copyright Notice : All Rights Reserved : Satya SaradaKandula 

Translated by Sita

Advertisements